అమెరికాలో విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వరుణ్ అరోరా (38) అనే భారతీయుడిని అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఆగస్టు 2024లో రోడ్ ఐలాండ్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. నిద్రపోతున్నట్లు నటిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వరుణ్‌ను బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఫెడరల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి త్వరలోనే శిక్ష ఖరారు చేయనున్నారు. అతడికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.