బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన గగన్‌దీప్ సింగ్ (34) అనే వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఒక యువతిని కిడ్నాప్ చేసి, రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేసి, రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు లండన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది. ఫిబ్రవరిలో విచారణ జరిపిన కోర్టు అతన్ని దోషిగా తేల్చి, తాజాగా ఈ శిక్షను ఖరారు చేసింది. ఇందులో 28 ఏళ్లు జైలులో, ఆరేళ్లు కఠిన నిబంధనల మధ్య పర్యవేక్షణలో గడపాల్సి ఉంటుంది.