పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో భారత నౌకాయాన రంగం అద్భుత విజయాన్ని సాధించింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను దాటింది భారత నౌక 'గ్రీన్ ఆశా'. ఈ నౌక గురువారం సురక్షితంగా జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) తీరానికి చేరుకుంది. సుమారు 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లోడ్‌తో వచ్చిన ఈ నౌకకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. LPG లోడ్‌తో ఈ నౌక రావడంలో ఇండియాలో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.