హార్ముజ్ దాటిన భారతీయ నౌకలు.. గ్యాస్ సరఫరాకు భరోసా!

2932చూసినవారు
హార్ముజ్ దాటిన భారతీయ నౌకలు.. గ్యాస్ సరఫరాకు భరోసా!
హార్ముజ్ జలసంధిని దాటి మరో రెండు భారతీయ ఎల్ పీజీ నౌకలు, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, దాదాపు 94వేల టన్నుల గ్యాస్‌తో స్వదేశానికి బయలుదేరాయి. బీడబ్ల్యూ టైర్ మార్చి 31న ముంబైకి, బీడబ్ల్యూ ఎల్మ్ ఏప్రిల్ 1న న్యూ మంగళూరుకు చేరుకోనున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ నౌకలకు ప్రయాణానికి అనుమతిచ్చింది. గత కొద్ది రోజులుగా పలు భారతీయ నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా చేరుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్