ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి, ఐటీ విద్యార్థిగా ఉంటూనే న్యాయవాది అవతారం ఎత్తి, ఒక అమాయక ఆస్తి కొనుగోలుదారుడి నుంచి 2.09 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.1.33 కోట్లు) కాజేసిన భారతీయ యువకుడు ప్రదీప్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. నవంబర్ 13న ఇల్లు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. వారం తర్వాత మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 1,00,000 డాలర్ల జరిమానా విధించింది.