సెప్టెంబర్‌లో జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల కోసం భారత మహిళల
టీ20 జట్టును సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు.
టీ20 ప్రపంచకప్‌లో జట్టును సెమీఫైనల్ చేర్చలేకపోయినప్పటికీ, హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తూ 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ప్రపంచకప్‌లో విఫలమైన యస్తికా భాటియా స్థానంలో 17 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాటర్ జి.కమలినికి చోటు కల్పించారు. శ్రేయాంక పాటిల్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.