శాశ్వత నివాస పరిమితి పెంపుపై బ్రిటన్‌లో భారతీయుల ఆందోళన

4952చూసినవారు
శాశ్వత నివాస పరిమితి పెంపుపై బ్రిటన్‌లో భారతీయుల ఆందోళన
బ్రిటన్ ప్రభుత్వం శాశ్వత నివాసం (ILR) కోసం దరఖాస్తు చేసుకునే కాల పరిమితిని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచే ప్రతిపాదనపై అక్కడి పార్లమెంటులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పు అమలైతే, బ్రిటన్‌లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్కిల్డ్ వర్కర్స్, హెల్త్ అండ్ కేర్ వీసాలపై ఉన్నవారు ILR కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఐదేళ్ల కాలపరిమితి ఉంది. దీనిని పదేళ్లకు పెంచాలనే ప్రభుత్వ యోచనతో, మీడియం స్కిల్స్ ఉద్యోగాలకు అర్హత పొందే వ్యక్తుల సంఖ్య తగ్గుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా ILR కోసం ప్రయత్నిస్తే వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ తప్పదని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్