దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. దీంతో సెన్సెక్స్ 1600 పాయింట్లు పైగా లాభంతో 75,470 వద్ద, నిఫ్టీ 437 పాయింట్ల లాభంతో 23,599 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.