ఇండిగో విమానయాన సంస్థ, తక్కువ లగేజీతో (కేవలం క్యాబిన్ బ్యాగ్ మాత్రమే) ప్రయాణించేవారికి తక్కువ ఛార్జీతో విమానంలో ప్రయాణించేలా ‘ఇండిగో లైట్’ పేరుతో ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది వర్తిస్తుంది. సాధారణ ఎకానమీ టికెట్లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉంటాయి. కేవలం 7 కేజీల వరకు క్యాబిన్ బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తారు. విమాన ప్రయాణాన్ని మరింత ఎక్కువ మందికి, తక్కువ ధరలో అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని సంస్థ తెలిపింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాంటి విధానాన్ని అనుసరిస్తోంది.