5.1% వృద్ధి నమోదు చేసిన మేలో పారిశ్రామికోత్పత్తి

5597చూసినవారు
5.1% వృద్ధి నమోదు చేసిన మేలో పారిశ్రామికోత్పత్తి
తయారీ రంగం మెరుగైన పనితీరు కనబరచడంతో మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ఇది 4.9 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మైనింగ్, క్వారీయింగ్‌ రంగం మైనస్ 1.6 శాతం వృద్ధి చెందగా, తయారీ రంగం 5.5 శాతం, విద్యుత్–గ్యాస్ సరఫరా విభాగం 9.9 శాతం వృద్ధి సాధించాయి. తయారీ రంగంలో 23 గ్రూప్‌లలో 16 సానుకూల పనితీరు చూపాయి. మోటార్ వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, బేసిక్ మెటల్స్ ప్రధానంగా వృద్ధిని నడిపించాయి. బేస్ ఎఫెక్ట్ కారణంగా జూన్‌లో ఐఐపీ వృద్ధి 5.7%కి చేరవచ్చని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్