AP: అనంతపురం నగరంలోని శిశుగృహలో పసికందు మృతి ఘటనపై ఐసీడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి విచారణ చేపట్టారు. పోషించుకునే స్థోమత లేదని కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ శిశువును ఐసీడీఎస్‌కు అప్పగించింది. ఈ నెల 2న ఆకలితో విలపిస్తూ ఆ చిన్నారి మృతి చెందాడు. శిశుగృహలో ఇద్దరు ఆయాలు గొడవపడి పసికందుకు పాలు పట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది.