సమాచార శాఖ కమిషన్ ఎంపికకు శ్రీకారం

7793చూసినవారు
సమాచార శాఖ కమిషన్ ఎంపికకు శ్రీకారం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార శాఖ కమిషన్ ఎంపికకు శ్రీకారం చుట్టింది. దీనిపై తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాన కమిషనర్, నాలుగు కమిషనర్ల పోస్టులకు ప్రకటన వెలువరించింది. ఇప్పటికే ఈ పోస్టులకు 200కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 25వ తేదీలోకా కొత్తవారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ నెలలోనే ప్రధాన కమిషనర్ పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్