ఓ అపార్ట్‌మెంట్‌లో మానవత్వం లేని ఘటన వెలుగుచూసింది. భారీ పార్శిల్‌తో వచ్చిన డెలివరీ ఏజెంట్‌కు లిఫ్ట్ సౌకర్యం నిరాకరించడంతో అతను ప్రాణాలకు తెగించి 6వ అంతస్తు వరకు మెట్లెక్కుతూ మోసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోబోయాడు. తీరా ఇంటికి చేరుకోగానే లోపలి వ్యక్తి కేవలం 'ఆరామ్‌సే.. జాగ్రత్త' అంటూ మాటలతో సరిపెట్టారు. ఈ వీడియో వైరల్ అవడంతో సదరు అపార్ట్‌మెంట్ వాసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.