కూటమి పాలనలో అన్యాయాలు, అక్రమాలు: మాజీ మంత్రి శైలజానాధ్

18చూసినవారు
కూటమి పాలనలో అన్యాయాలు, అక్రమాలు: మాజీ మంత్రి శైలజానాధ్
AP: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, నియామకాల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు పాతర వేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్' అమలు చేయకుండానే విజయం సాధించినట్లు ప్రకటించుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్