AP: ఎర్రచందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి పనులు చేస్తున్న వారు.. వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. లేదంటే స్పెషల్ ఆపరేషన్ చేపడతామని చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో స్ఫూర్తి పొందిన చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తులు.. ఎర్రచందనం స్మగ్లర్లను వెంబడించారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.