AP:
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగన్‌పై పలు ఆరోపణలు చేశారు. వైసీపీలో తాను 74 రకాలుగా అవమానాలకు గురయ్యానని, అందులో రెండు ఘటనలు ఎప్పటికీ మర్చిపోలేనివని చెప్పారు. 2024లో పార్టీ ఓటమి తర్వాత తనను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా నియమించి, సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించడం తనను బాధించిందన్నారు. అలాగే 2023 డిసెంబరులో జగన్ ఢిల్లీ అపాయింట్‌మెంట్లను ఇకపై అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి చూస్తారని ప్రధాని మోదీకి చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.