తిరుపతి మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ?

6541చూసినవారు
తిరుపతి మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ?
AP: తిరుపతి మేయర్ పీఠం కోసం టీడీపీ, జనసేన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో మేయర్ సీటు తమకే దక్కాలని టీడీపీ భావిస్తోంది. అయితే, టీటీడీ చైర్మన్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్, ఎస్వీబీసీ చైర్మన్, తుడా చైర్మన్ వంటి కీలక పదవులన్నీ టీడీపీకే దక్కాయని, కాబట్టి మేయర్ సీటు తమకే ఇవ్వాలని జనసేన వాదిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో జనసేనకు ప్రాధాన్యత కలిగిన మరో కార్పొరేషన్ కేటాయించే అవకాశాలు లేకపోవడంతో, మేయర్ సీటును వదులుకోవడానికి జనసేన సిద్ధంగా లేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్