గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీలో పోటీ

16చూసినవారు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీలో పోటీ
AP: రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాలు టీడీపీకే దక్కే అవకాశాలు ఉండటంతో సీనియర్ నేతలు, ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో టికెట్లు దక్కని నాయకులతో పాటు పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన పలువురు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, కర్రోతు బంగార్రాజు, మహాసేన రాజేష్, వర్ల రామయ్య తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్