కాలువలో దూకి ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య

131చూసినవారు
కాలువలో దూకి ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య
AP: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దమ్మెన్ను వంతెన వద్ద ఇంటర్  విద్యార్థిని పూజిత కళాశాల బస్సులో ఇంటికి వస్తుండగా అస్వస్థతగా ఉందని చెప్పి బస్సు దిగి కాలువలోకి దూకింది. కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో విద్యార్థిని ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోగా, కూలి పనులు చేసే తల్లి కష్టపడి చదివిస్తున్న పూజిత ఇలా చేయడం స్థానికులను కలచివేసింది.

ట్యాగ్స్ :