AP:
ఎన్టీఆర్ జిల్లా, పోరంకిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగిన ఆమె, శనివారం చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.