AP: అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇడపనుచేనుపల్లికి చెందిన రైతు ఇరగంరరెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. అందులో వేరుశనగ సాగు చేస్తున్నాడు. పొలం పనులు చూసుకుంటుండటంతో తండ్రికి భోజనం తీసుకుని పెద్ద కుమారుడు సాయికుమార్ రెడ్డి (18) శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మోటారు స్టార్టర్ తీగలు చుట్టుకుని విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం పనుల్లో చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.