ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ, ఈఏపీసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు జూన్ 5తో ముగియగా ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ 15 నుంచి 18 మధ్య ఫలితాలను విడుదల చేసే అవకాశముందని సమాచారం. అనంతరం ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈఏపీసెట్ ర్యాంకులు ఖరారు చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తైన రెండు నుంచి మూడు రోజుల్లో ఈఏపీసెట్ ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.