AP: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ
పరీక్షలు జూన్ 5న ముగియనున్నాయి. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం 12 వారాల పాటు కొనసాగి, జూన్ 18 తరువాత జూన్ 20లోపు
ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 21 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో, ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పించారు. ఈ
పరీక్షలు ముగిశాక ఇంటర్ ప్రాక్టికల్
పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరగనున్నాయి. ఈఏపీసెట్ విద్యార్ధులు సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, సప్లిమెంటరీ
ఫలితాలు వెలువడిన తర్వాతే ఈఏపీసెట్
ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.