పశ్చిమాసియా యుద్ధం, వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో వడ్డీరేట్లు పెరగొచ్చని ICICI బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ అంచనా వేసింది. ఈ మేరకు వడ్డీరేట్లపై 50-75 బేసిస్ పాయింట్ల (0.5%-0.75%) పెరుగుదల ఉండొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి చేరిందని, FY27లో ద్రవ్యోల్బణం 5%కు చేరొచ్చని తెలిపింది. ప్రస్తుతం రెపో రేట్ 5.25%గా ఉంది. వడ్డీరేట్లు పెరిగితే లోన్లు భారంగా మారే అవకాశం ఉంది.