చిరంజీవి హాలీవుడ్ చిత్రం ఆగిపోవడంపై ఆసక్తికర విషయాలు

4270చూసినవారు
చిరంజీవి హాలీవుడ్ చిత్రం ఆగిపోవడంపై ఆసక్తికర విషయాలు
మెగాస్టార్ చిరంజీవి నటించాల్సిన 'ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్' అనే హాలీవుడ్ చిత్రం 20 ఏళ్ల క్రితం నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. రూ.43 కోట్ల వ్యయంతో ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించాలని భావించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాల్సి ఉంది. 1999 ఆగష్టు 21న ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 4న లాంఛనంగా ప్రారంభమైంది. అప్పట్లో 12 కోట్ల రికార్డు స్థాయి ఆఫర్లు వచ్చినా, నిర్మాతల విభేదాలతో ఇది అసంపూర్ణంగా నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్