ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల.. 120 రోజులు సెలవులే

20చూసినవారు
ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల.. 120 రోజులు సెలవులే
AP: ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్-మార్చి మధ్య మొత్తం 314 రోజులకు గాను 232 రోజులు పని దినాలుగా ఉంటాయి. ఆదివారాలు, రెండో శనివారాలు, ప్రభుత్వ సెలవులు, పండుగలకు కలిపి 82 రోజులు సెలవులు ప్రకటించారు. అక్టోబర్‌లో దసరా సందర్భంగా 14 రోజులు, జనవరిలో సంక్రాంతికి 13 రోజులు సెలవులు ఉంటాయి. అలాగే ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు 38 రోజుల పాటు వేసవి సెలవులు కూడా ఉంటాయి. మొత్తం మీద ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 120 రోజులు సెలవులు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్