అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: అమిత్ షా

దేశంలో డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబైలో ఒక అంతర్జాతీయ ముఠాను పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో రూ.1,745 కోట్ల విలువైన 349 కేజీల హైక్వాలిటీ కొకెయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వల్ప మొత్తంలో జరిగిన డ్రగ్స్ రవాణా ఆధారంగా ఈ అంతర్జాతీయ ముఠాను పట్టుకున్నట్లు హోం మంత్రి తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్‌సీబీ బృందాన్ని ఆయన అభినందించారు.
