భక్తులను మభ్యపెట్టి చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్‌

828చూసినవారు
భక్తులను మభ్యపెట్టి చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్‌
తిరుమల టూటౌన్‌ పోలీసులు శుక్రవారం ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్, మండ నవీన్‌ ముఠాగా ఏర్పడి, భక్తులను మాటలతో మభ్యపెట్టి వారి లగేజీ బ్యాగులను స్వాధీనం చేసుకుని నగదు, వస్తువులు చోరీ చేసినట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో కర్ణాటక, తెలంగాణకు చెందిన భక్తులతో పరిచయం ఏర్పరచుకుని ఈ దొంగతనాలు జరిగినట్లు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్