ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బాలికను బంధించి పలుమార్లు లైంగిక దాడి

10081చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బాలికను బంధించి పలుమార్లు లైంగిక దాడి
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 16 ఏళ్ల బాలికను బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పేరుతో సోషల్ మీడియాలో పరిచయమైన నిందితుడు, బాలిక వ్యక్తిగత ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఆమెను పలుమార్లు కలుసుకుని వేధించాడు. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఈ నెల 2న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం రాత్రి అద్దె ఇంటిలో చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న బాలికను రక్షించారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్