సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కొనసాగుతున్న విచారణ

1చూసినవారు
సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కొనసాగుతున్న విచారణ
AP: విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో కృష్ణలంక సస్పెండ్డ్ సీఐ నాగరాజుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. లాకప్ డెత్ తర్వాత ఏం జరిగిందనే దానిపై సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంపై నిందితులు నోరు మెదపడం లేదని అధికారులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, మరో కానిస్టేబుల్ కూడా అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్