ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. రోహిత్ ఈసారి చాలా ఫిట్‌గా, కళ్ళలో కసితో, గన్స్ బ్లేజింగ్ తరహాలో విరుచుకుపడతాడని ప్రశంసించాడు. టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నాక ఐపీఎల్ రోహిత్‌కు తన సత్తా నిరూపించుకోవడానికి గొప్ప వేదిక అని, విరాట్ కోహ్లీ వంటి వారితో పాటు తానూ ఇంకా అత్యుత్తమ ప్లేయర్‌నే అని నిరూపించుకోవడానికి ఈ రెండు నెలలు కీలకం అని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.