బంగ్లాదేశ్‍లో ఐపీఎల్ ప్రసార ఒప్పందం రద్దు

2689చూసినవారు
బంగ్లాదేశ్‍లో ఐపీఎల్ ప్రసార ఒప్పందం రద్దు
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్‌తో జియోస్టార్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భాగస్వామ్య పక్షం చెల్లింపుల్లో విఫలమవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఆ నిషేధంపై పునరాలోచిస్తామని సంకేతాలు ఇచ్చినప్పటికీ, జియోస్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ రద్దుతో 2027 వరకు టీస్పోర్ట్స్ కు ఉన్న ఐపీఎల్ ప్రసార అనుమతులు రద్దయ్యాయి. ఇది బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ వీక్షకుల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్