ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను. నా లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడికి ఐపీఎల్‌లో ఇతర నైపుణ్యాలు ఉన్నవారికి లభించేంత డబ్బు రాదు. ఐపీఎల్ కోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అందుకు తగిన ప్రతిఫలం లేనప్పుడు అంత సమయం వెచ్చించడం సరైన నిర్ణయం అని నాకు అనిపించలేదు" అని జంపా వివరించాడు. ఐపీఎల్‌లో విదేశీ స్పిన్నర్లకు డిమాండ్ తక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.