IPL: ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం

3275చూసినవారు
IPL: ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం
IPL-2026: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన GT నిర్ణీత 20 ఓవర్లలో 210/4 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన DC నిర్ణీత 20 ఓవర్లలో 209/8 రన్స్ మాత్రమే చేసింది. DC బ్యాటర్లలో KL రాహుల్ (92) ఒంటరి పోరాటం చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ 41(20 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం దక్కలేదు. పాతుమ్ నిస్సాంక 41 పరుగులు చేశారు. రషీద్ ఖాన్ 3, ప్రసిద్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్