చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 127 పరుగల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి విధ్వంసం సృష్టించారు. యశస్వి జైస్వాల్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. జురెల్ 18, పరాగ్ 14* పరుగులు చేశారు.