ఐపీఎల్ 2026 సీజన్‌లో మూడో మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండడంతో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టాస్ ఐదు నిమిషాలు ఆలస్యమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గువాహటిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈసారి ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు. సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడిస్తున్నట్లు తెలిపారు.