ఒమన్ తీరంలో అమెరికా లాజిస్టిక్స్ నౌకపై ఇరాన్ దాడి

9014చూసినవారు
ఒమన్ తీరంలో అమెరికా లాజిస్టిక్స్ నౌకపై ఇరాన్ దాడి
ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన ఒక భారీ లాజిస్టిక్స్ నౌకపై ఇరాన్ శనివారం దాడి చేసింది. ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి ఈ దాడిని అధికారికంగా ప్రకటించారు. అమెరికా సైన్యానికి అవసరమైన యుద్ధ సామగ్రిని, ఇంధనాన్ని సరఫరా చేసే ఈ నౌకను దెబ్బతీయడం ద్వారా అమెరికాను యుద్ధ భూమిలో అస్తవ్యస్తం చేయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ దాడితో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్