ఫిఫాకు ఇరాన్‌ భావోద్వేగ వీడ్కోలు

439చూసినవారు
ఫిఫాకు ఇరాన్‌ భావోద్వేగ వీడ్కోలు
ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు చేరుకోవాలన్న ఇరాన్ జట్టు ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఈ జట్టు, చివరి మ్యాచ్ అనంతరం లాకర్‌ రూమ్‌లో ఉద్వేగపూరిత లేఖను ఉంచింది. వేల సంవత్సరాలుగా విజయం కంటే గౌరవానికే ప్రాధాన్యతనిచ్చిన ఇరాన్ నుంచి తాము వచ్చామని, ఫుట్‌బాల్ కేవలం పోటీ కాదని, వ్యక్తిత్వానికి సంబంధించిన పరీక్ష అని ఆటగాళ్లు అందులో పేర్కొన్నారు. గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఈజిప్టుతో 1-1 డ్రా అవడంతో ఇరాన్ ఇంటిముఖం పట్టింది.

సంబంధిత పోస్ట్