లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలు గడవక ముందే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పశ్చిమాసియా పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారనున్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.