అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ మాట్లాడుతూ, ఇరాన్‌తో ఇక ముప్పు లేదని, 47 ఏళ్లుగా అమెరికాకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయిందని తెలిపారు. అమెరికా సైనికచర్య అత్యంత పటిష్ఠంగా సాగిందని, ఇరాన్ సైన్యాన్ని నామరూపాల్లేకుండా చేశారని చెప్పారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రాధేయపడిందని, నిమిషాల్లో ఆ దేశాన్ని కుప్పకూల్చే శక్తి ఉన్నా ట్రంప్ దయ చూపారని, అమెరికా షరతులకు ఇరాన్ ఒప్పుకోకపోతే తీవ్రదాడులు జరిగేవని హెగ్సెత్ పేర్కొన్నారు.