హార్ముజ్, యురేనియంపై రాజీకి నిరాకరించిన ఇరాన్

3537చూసినవారు
హార్ముజ్, యురేనియంపై రాజీకి నిరాకరించిన ఇరాన్
అమెరికాతో శాంతి ఒప్పంద చర్చలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, యురేనియం శుద్ధీకరణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికే శుద్ధీకరించిన యురేనియం నిల్వలను కొనసాగిస్తామని వెల్లడించింది. మరోవైపు, చర్చల ముసాయిదాలో 60 రోజుల కాల్పుల విరమణ, ఆంక్షల సడలింపు, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం దేశ అత్యున్నత నాయకత్వం ఆమోదం తర్వాతే తీసుకుంటామని ఇరాన్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్