పశ్చిమ ఆసియాలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం మూడు వారాల వ్యవధిలోనే అమెరికా సైన్యం సుమారు 1.4 బిలియన్ డాలర్ల నుండి 2.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12,600 కోట్ల నుండి రూ. 26,100 కోట్ల) వరకు నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో అమెరికా పలు ఖరీదైన యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, ఇంధన ట్యాంకర్లను కోల్పోయింది. పెంటగాన్ యుద్ధ సన్నద్ధత కొనసాగింపునకు 200 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ కోసం వైట్ హౌస్‌ను కోరనుంది. యుద్ధం ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే ఈ భారీ వ్యయం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది.