ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారదని, తన పాలనలో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను,
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఈ ప్రకటన వెలువడింది. గత మూడు దశాబ్దాలుగా తాను ఇరాన్‌పై అంతర్జాతీయ యుద్ధం చేయకపోయి ఉంటే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయగల అణుబాంబును ఇరాన్ ఎప్పుడో అభివృద్ధి చేసి ఉండేదని చెప్పుకొచ్చారు.