హార్ముజ్‌పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం.. నౌకలపై ఛార్జీల విధింపు

8406చూసినవారు
హార్ముజ్‌పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం.. నౌకలపై ఛార్జీల విధింపు
హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించడంతో పాటు, ఆంక్షలు విధించే ఇతర దేశాల నౌకలకు కూడా ఇది వర్తించనుంది. అయితే, ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది, భారత నౌకలు ఈ జాబితాలో ఉన్నాయా అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జీలు విధించట్లేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్