పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ 'సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర'ను ప్రారంభించింది. 2026 ఫిబ్రవరి 6న సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ 11 రోజుల యాత్రలో దేశంలోని ప్రముఖ 7 జ్యోతిర్లింగాలను (మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్) దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ జంక్షన్లలో బోర్డింగ్ సౌకర్యం ఉంది. మొత్తం 750 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వసతి 2AC, 3AC, స్లీపర్ క్లాస్‌లో లభిస్తుంది. యాత్ర ఖర్చు స్లీపర్ ట్రైన్‌లో రూ.17,600 నుంచి ప్రారంభమై, 2ACలో రూ.34,600 వరకు ఉంటుంది. పిల్లలకు రాయితీలు కూడా ఉన్నాయి. ఆసక్తి గల భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.