ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత
క్రికెట్ జట్టుకు బెల్‌ఫాస్ట్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. కాన్సులేట్ జనరల్ కిరణ్ ఖత్రీ టీమిండియా సభ్యులను, కోచింగ్ సిబ్బందిని ఆహ్వానించి,
క్రికెట్ ప్రజలను ఎలా దగ్గర చేస్తుందో వివరించారు. ఈ సందర్భంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా భారత
క్రికెట్ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐర్లాండ్‌లోని ప్రవాస భారతీయులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు.