ఇరాన్ శక్తిమంతమైన సైనిక విభాగం ఐఆర్‌జీసీ నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి కన్నుమూశారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది. ఐఆర్ జీసీ అధికారిక వెబ్‌సైట్ 'సెపా న్యూస్' ఈ విషయాన్ని వెల్లడించింది. తమ కీలక కమాండర్ మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది.