ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల

528చూసినవారు
ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల
AP: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు 3,200 క్యూసెక్కుల సాగునీటిని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ నీటితో కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సుమారు 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు సకాలంలో నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్