కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో, ఇతర హీరోలు కూడా రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా, హీరో ధనుష్ కూడా త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఫ్యాన్ క్లబ్ ఆదివారం ఓ కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించడం, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పిలుపునివ్వడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రణాళికలు జరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ధనుష్ నుండి ఎటువంటి స్పందన రాలేదు.