ప్రస్తుతం ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ అవసరంగా మారింది. RO నీటి వల్ల హానికరమైన బ్యాక్టీరియా, కెమికల్స్ తొలగిపోతాయని నమ్మకం ఉన్నా, అవసరమైన ఖనిజాలు తగ్గిపోతాయనే ఆందోళన ఉంది. అయితే, వైద్య నిపుణుల ప్రకారం, RO నీటి వల్ల శరీరానికి పెద్దగా ముప్పు లేదని, ఎందుకంటే శరీరానికి కావాల్సిన ఖనిజాలు ఆహారం ద్వారానే ఎక్కువగా అందుతాయని తెలిపారు. కిడ్నీల ఆరోగ్యంపై కూడా RO నీటి ప్రభావం అపోహ మాత్రమేనని నెఫ్రాలజిస్టులు స్పష్టం చేశారు.